మహబూబాబాద్‌లో లారీ బోల్తా.. నలుగురు కూలీలు మృతి
దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమంగా కర్రను తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామం ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకివెళితే.. అర్థరాత్రి దాటాక అక్రమంగా కర్ర లోడుతో జిల్లాలోనికి ప్రవేశించిన లారీ చెరువు కట్ట వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం […]
దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమంగా కర్రను తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామం ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. వివరాల్లోకివెళితే.. అర్థరాత్రి దాటాక అక్రమంగా కర్ర లోడుతో జిల్లాలోనికి ప్రవేశించిన లారీ చెరువు కట్ట వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 11 మంది కూలీలు ఉన్నారు. అందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ఏడుగురు కూలీలు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులంతా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అంబోతులా తండాకు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు ఆంబోతు హర్యా, ఆంబోతు గోవిందర్, ఆంబోతు మధు, రాట్ల ధూర్యా లు కూడా అదే జిల్లాకు చెందిన వారీగా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్సై నగేష్, పోలీస్ సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.