విద్యార్థులను వదలని కరోనా
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని స్కూళ్లల్లో కరోనా విజృంభిస్తోంది. విద్యార్థులు, టీచర్లపై కరోనా పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లల్లో అనేకమంది విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. త్వరలో దీనిపై సమీక్ష జరపనున్న అధికారులు.. స్కూళ్లను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి స్కూళ్లల్లో కరోనా కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా మంథని జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని స్కూళ్లల్లో కరోనా విజృంభిస్తోంది. విద్యార్థులు, టీచర్లపై కరోనా పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లల్లో అనేకమంది విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. త్వరలో దీనిపై సమీక్ష జరపనున్న అధికారులు.. స్కూళ్లను మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి స్కూళ్లల్లో కరోనా కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా మంథని జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ఆ స్కూల్‌లోని విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తు్న్నారు.