దేశంలో వాళ్లని కలిపితే రాష్ట్రమే అవుతుందట.. మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: మనదేశంలో 4 లక్షల మంది పైగా బిచ్చగాళ్లు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. పార్లమెంట్‌లో కేంద్ర సామాజిక న్యాయం మరి సాధికారిత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ దేశంలో ఎంతమంది బిచ్చగాళ్లు ఉన్నారనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా గెహ్లాట్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బెగ్గర్స్ రేషియోని నోట్ రూపంలో విడుదల చేశారు. 2011 లెక్కల ప్రకారం.., దేశంలో 2,21,673 పురుషులు, 1,91,997మంది మహిళలతో కలిపి మొత్తం 4,13,670 మంది బెగ్గర్స్ […]
దిశ,వెబ్‌డెస్క్: మనదేశంలో 4 లక్షల మంది పైగా బిచ్చగాళ్లు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. పార్లమెంట్‌లో కేంద్ర సామాజిక న్యాయం మరి సాధికారిత మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ దేశంలో ఎంతమంది బిచ్చగాళ్లు ఉన్నారనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా గెహ్లాట్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బెగ్గర్స్ రేషియోని నోట్ రూపంలో విడుదల చేశారు. 2011 లెక్కల ప్రకారం.., దేశంలో 2,21,673 పురుషులు, 1,91,997మంది మహిళలతో కలిపి మొత్తం 4,13,670 మంది బెగ్గర్స్ గా తన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు నోట్ లో పేర్కొన్నారు. బెగ్గర్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ ప్రథమస్థానంలో ఉంది.
వెస్ట్ బెంగాల్ లో – 81,224, ఉత్తర్ ప్రదేశ్ – 65,835, ఆంధ్రప్రదేశ్ -30,218, బీహార్ – 29,723, మధ్యప్రదేశ్- 28,695, రాజస్తాన్ – 25,853, ఢిల్లీ- 2,187, ఛండీగడ్ -121, లక్ష్యద్వీప్ లో -2, దామన్ -19 దియూలో- 22, అండమాన్, నికోబార్ దీవుల్లో -56 మంది ఉన్నారని కేంద్రమంత్రి తవార్ చంద్ గెహ్లాట్ విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు.