రాష్ట్రానికి నేడు కేంద్ర బృందాలు వచ్చి ఏం చేస్తాయంటే..?
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున 4 కేంద్ర బృందాలు రాష్ట్రానికి నేడో, రేపో రానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మున్సిపాలిటీలు, నగరాల్లో పర్యటించి పరిశీలించనున్నారు. కరోనా టెస్టుల సంఖ్యను ఎలా పెంచాలో, కరోనాను కట్టడి చేసేందుకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సూచనలివ్వనున్నాయి. అదేవిధంగా కరోనా సోకిన వారికి సమర్థవంతంగా చికిత్స ఎలా అందించాలో అనేదానిపై వీరు సూచనలివ్వనున్నారు. ఇలా వైరస్ ను కట్టడి చేసేందుకు […]
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున 4 కేంద్ర బృందాలు రాష్ట్రానికి నేడో, రేపో రానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. మున్సిపాలిటీలు, నగరాల్లో పర్యటించి పరిశీలించనున్నారు. కరోనా టెస్టుల సంఖ్యను ఎలా పెంచాలో, కరోనాను కట్టడి చేసేందుకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సూచనలివ్వనున్నాయి. అదేవిధంగా కరోనా సోకిన వారికి సమర్థవంతంగా చికిత్స ఎలా అందించాలో అనేదానిపై వీరు సూచనలివ్వనున్నారు. ఇలా వైరస్ ను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎప్పటికప్పుడు ఈ బృందాలు సహకరించనున్నాయి.