ధవళేశ్వరం వద్ద మడో ప్రమాద హెచ్చరిక ?
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఎగువప్రాంతాల నుంచి వరద, మరోవైపు రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారీజీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తి 14.14 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. ప్రస్తుతమున్న నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ […]
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఎగువప్రాంతాల నుంచి వరద, మరోవైపు రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారీజీకి భారీగా వరద నీరు కొనసాగుతోంది.
దీంతో 17 గేట్లు ఎత్తి 14.14 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. ప్రస్తుతమున్న నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.