ఖమ్మంలో మరో ముగ్గురికి కరోనా ..ఒకరు మృతి
దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో తాజాగా బుధవారం మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. పట్టణంలోని డీఆర్‌డీఏ కార్యాలయం సమీపంలోని ఆంధ్రాబ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఖమ్మం నగరంలో ఇది తొలి కరోనా మరణం కాగా, జిల్లాలో రెండోవది. అదేవిధంగా స్థానిక ఎన్‌ఎస్‌టీ రోడ్డులో గతంలో పాజిటివ్ వచ్చిన బంధువుకు ఈరోజు కరోనా నిర్దారణ అయ్యింది. […]
దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో తాజాగా బుధవారం మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. పట్టణంలోని డీఆర్‌డీఏ కార్యాలయం సమీపంలోని ఆంధ్రాబ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఖమ్మం నగరంలో ఇది తొలి కరోనా మరణం కాగా, జిల్లాలో రెండోవది. అదేవిధంగా స్థానిక ఎన్‌ఎస్‌టీ రోడ్డులో గతంలో పాజిటివ్ వచ్చిన బంధువుకు ఈరోజు కరోనా నిర్దారణ అయ్యింది. అలాగే కవిరాజ్ నగర్‌లో ఒక వైద్యునికి కరోనా వచ్చింది.
ముదిగొండలో రెండు నెలల చిన్నారి మృతి..
ముదిగొండ మండలంలో ఓ రెండు నెలల బాబు కరోనాతో మృతిచెందాడు. గత కొంతకాలంగా బాబు అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. చిన్నారి రక్త నమూనాలు సేకరించి కరోనా టెస్టులకు పంపారు. అనంతరం శిశువు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడంతో స్వస్థలం ముదిగొండలో ఖననం చేశారు. బుధవారం ఉదయం కరోనా టెస్టు ఫలితాల్లో బాలుడికి పాజిటివ్ రావడంతో మండలాధికారులకు నీలోఫర్ వైద్యులు సమాచారం అందించారు. దీంతో ముదిగొండలోని బాబు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.వారికి కూడా రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వారి రిపోర్టులు వెలువడాల్సి ఉంది.