యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు 3వేల మంది ప్రయాణికులు
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్ని కరోనా భయపెడుతోంది. ఈ సారి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక గత నాలుగువారాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాలకే యూకే నుంచి సుమారు 3వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూల్ కు సుమారు 38మంది వచ్చారు. వచ్చిన వారిని గుర్తించి వెంటనే బ్లెడ్ శాంపిల్స్ తీసుకోవాలని కలెక్టర్ ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజమండ్రిలో […]
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్ని కరోనా భయపెడుతోంది. ఈ సారి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక గత నాలుగువారాల్లో ఒక్క తెలుగు రాష్ట్రాలకే యూకే నుంచి సుమారు 3వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది.
యూకే నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూల్ కు సుమారు 38మంది వచ్చారు. వచ్చిన వారిని గుర్తించి వెంటనే బ్లెడ్ శాంపిల్స్ తీసుకోవాలని కలెక్టర్ ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే రాజమండ్రిలో కరోనా మహిళా బాధితురాలి విషయం హైడ్రామా నెలకొంది. యూకే నుంచి రాజమండ్రికి వచ్చేందుకు వచ్చిన మహిళ, ఆమె కుమారుడు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగారు. దీంతో వైద్యపరీక్షించిన వైద్యులు ఆమెను క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కానీ క్వారంటైన్ నుంచి తప్పించుకొని ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చింది. సమాచారం అందుకు ఏపీ ఆరోగ్యశాఖ అధికారులు ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ ల కోసం పూణె ల్యాబ్ కు పంపించారు. దీంతో స్థానికుల్లో కొత్తరకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
మరోవైపు ట్రావెల్ హిస్టరీ ప్రకారం యూకే నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన 3వేల మంది ఎవరు..? ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.