నాగర్‌కర్నూలు జిల్లాలో 36 కరోనా కేసులు
దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 50కి మించి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 36 కేసులు నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అచ్చంపేటలో 9 కేసులు నమోదు కాగా, అమ్రాబాద్‌లో 2, బిజినపల్లిలో 4, కల్వకుర్తిలో 1, కొల్లాపూర్ 3, నాగర్‌కర్నూల్ 13, పదరలో 1, పెంట్లవెల్లిలో 3 కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంగా ఇప్పటివరకూ 365 కేసులు నమోదయ్యాయి. 9 మంది […]
దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 50కి మించి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 36 కేసులు నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అచ్చంపేటలో 9 కేసులు నమోదు కాగా, అమ్రాబాద్‌లో 2, బిజినపల్లిలో 4, కల్వకుర్తిలో 1, కొల్లాపూర్ 3, నాగర్‌కర్నూల్ 13, పదరలో 1, పెంట్లవెల్లిలో 3 కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంగా ఇప్పటివరకూ 365 కేసులు నమోదయ్యాయి. 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు ఇప్పటికైనా భౌతికదూరం పాటిస్తూ తప్పకుండా మార్కులు ధరించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాల్లో వ్యాపార సంఘాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉంటూ వైరస్ నియంత్రణకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు.