34 మంది హెరిటేజ్ సిబ్బంది క్వారంటైన్

హైదరాబాద్‌లోని ఉప్పల్ పారిశ్రామిక‌వాడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్‌లో కరోనా కలకలం సృస్టిస్తోంది. అక్కడ పనిచేస్తున్న 34 మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్ ‌కు తన తండ్రి ద్వారా కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్లాంట్ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా ఉన్న34 మందిని గుర్తించి రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు. ఈ వ్యవహారంపై స్థానికులకు అనుమానం రావడంతో […]

Update: 2020-04-29 02:58 GMT

హైదరాబాద్‌లోని ఉప్పల్ పారిశ్రామిక‌వాడలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంట్‌లో కరోనా కలకలం సృస్టిస్తోంది. అక్కడ పనిచేస్తున్న 34 మంది సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్ ‌కు తన తండ్రి ద్వారా కరోనా సోకింది. ఈ విషయాన్ని ప్లాంట్ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా ఉన్న34 మందిని గుర్తించి రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు. ఈ వ్యవహారంపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీ చేసి 34 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనపై హెరిటేజ్ ఫుడ్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tags: heritage, workers, quarantine, uppal, hyd

Tags:    

Similar News