వైద్యశాఖలో 306 పోస్టులు భర్తీ
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పోస్ట్‌లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 306 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేయగా వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 66 పోస్ట్‌లను, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో 240 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పోస్ట్‌ల్లో సివిల్ అసిస్టంట్‌సర్జన్ అనెస్థీసియా పోస్టులు 27, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్ పోస్టులు 17, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పల్మునరీ మెడిసిన్ పోస్ట్‌లు 06 జీడిఎంఓ ఎంబీబీఎస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పోస్ట్‌లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 306 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేయగా వీటిలో కాంట్రాక్ట్ పద్దతిలో 66 పోస్ట్‌లను, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో 240 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పోస్ట్‌ల్లో సివిల్ అసిస్టంట్‌సర్జన్ అనెస్థీసియా పోస్టులు 27, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్ పోస్టులు 17, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పల్మునరీ మెడిసిన్ పోస్ట్‌లు 06 జీడిఎంఓ ఎంబీబీఎస్ పోస్ట్‌లు 16 ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పోస్ట్‌లు స్టాఫ్ నర్స్ పోస్ట్‌లు 212, ల్యాబ్ టెక్నిషియన్ పోస్ట్‌లు 28 ఉన్నాయి. ఈ పోస్ట్‌లు జిల్లా వారిగా వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాధి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొవిడ్ రోగులకు సేవలందించేందుకు ప్రభుత్వం పోస్ట్‌ల భర్తీ చేపట్టింది.