సెల్ఫ్ క్వారంటైన్‌లో 30 మంది పోలీసులు

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులుకు విధుల నిర్వహణ కత్తి మీద సాములా తయారైంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా సోకడంతో 30 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఢిల్లీ 1510 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మహమ్మారి బారినపడి ఢిల్లీలో ఇప్పటి వరకు 28 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా ఇద్దరు ఏఎస్‌ఐలతో పాటు ఓ […]

Update: 2020-04-13 22:02 GMT

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసులుకు విధుల నిర్వహణ కత్తి మీద సాములా తయారైంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా సోకడంతో 30 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఢిల్లీ 1510 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మహమ్మారి బారినపడి ఢిల్లీలో ఇప్పటి వరకు 28 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా ఇద్దరు ఏఎస్‌ఐలతో పాటు ఓ కానిస్టేబుల్‌కు వైరస్ సోకడంతో వారితోపాటు విధులు నిర్వహించిన 30 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags: self quarantain, delhi police, carona

Tags:    

Similar News