హుజురాబాద్‌కు ఫైనల్ లిస్ట్.. బరిలో నిలిచింది ఎంత మందో తెలుసా.?

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీ నుండి తప్పుకున్నారు. తిరస్కరణకు గురైన తరువాత 42 మంది అభ్యర్థులు మిగలగా ఇందులో 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇతర అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. రెండు ఈవీఎంలు.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఎన్నికల […]

Update: 2021-10-13 04:17 GMT

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీ నుండి తప్పుకున్నారు. తిరస్కరణకు గురైన తరువాత 42 మంది అభ్యర్థులు మిగలగా ఇందులో 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇతర అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది.

రెండు ఈవీఎంలు..

అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఎన్నికల అధికారులు ఒక్కో పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలు అమర్చాల్సి ఉంటుంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలను పొందుపర్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుండి చివరగా పోటీ చేసే అభ్యర్థులు 30 మంది కావడంతో రెండు ఈవీఎంలను అమర్చనున్నారు.

 

Tags:    

Similar News