కారణం ఒకరు.. క్వారంటైన్ లోకి 3 గ్రామాలు

దిశ, మహబూబ్ నగర్: ఓ వ్యక్తి కారణంగా అధికారులు మూడు గ్రామాలను కంటైన్మెంట్ చేశారు. వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం రామచంద్రపురంలో కరోనా పాజిటివ్ వచ్చిన సాయిలు ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు ఆచూకీ కోసం పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. సాయిలు తోడల్లుడు కూతురు ప్రతానం ఈనెల 13న డిండి మండలం రామంతపూర్ గ్రామంలో నిర్వహించారు. అక్కడికి 40 మంది వరకు బంధువులు వెళ్లారు. 14న కడ్తాల్ మండలం వంపుగూడలో […]

Update: 2020-05-24 03:21 GMT

దిశ, మహబూబ్ నగర్: ఓ వ్యక్తి కారణంగా అధికారులు మూడు గ్రామాలను కంటైన్మెంట్ చేశారు. వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం రామచంద్రపురంలో కరోనా పాజిటివ్ వచ్చిన సాయిలు ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు ఆచూకీ కోసం పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. సాయిలు తోడల్లుడు కూతురు ప్రతానం ఈనెల 13న డిండి మండలం రామంతపూర్ గ్రామంలో నిర్వహించారు. అక్కడికి 40 మంది వరకు బంధువులు వెళ్లారు. 14న కడ్తాల్ మండలం వంపుగూడలో పెళ్లి చేశారు. అక్కడికీ రామచంద్రపురం, రామంతపూర్ గ్రామాలతోపాటు అమ్మాయి సొంతూరు మాడ్గుల మండలం గిరికొత్తపల్లి నుంచి మరో 40 మంది హాజరయ్యారు. ఈ నెల 18న సాయిలు తన గ్రామంలో వడిబియ్యం దావత్ ఏర్పాటు చేశాడు. అందులో 100 మంది వరకు పాల్గొన్నారు. అయితే, సాయిలుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రామచంద్రపురం, రామంతపూర్, వంపుగూడ గ్రామాలను కంటైన్మెంట్ జోన్ గా గుర్తించడంతోపాటు మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి చెస్ట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఫీవర్ హాస్పిటల్ కు వెళ్ళిన సాయిలు ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నాడు. సాయిలుకు ఎవరి ద్వారా కరోనా సోకిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News