సైబరాబాద్ పోలీసులకు 3టన్నుల ఉసిరికాయలు
దిశ, క్రైమ్‌బ్యూరో: కొవిడ్ -19 నివారణకు ముందుండి పోరాడుతున్న సైబరాబాద్ పోలీసులకు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త, వియ్ హబ్ ఛైర్‌పర్సన్ కీర్తి ప్రియ 3 టన్నుల ఉసిరికాయలను అందజేశారు. మంగళవారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను ఆమె తమ బృందంతో కలిశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో కరోనా వైరస్ తో పోరాడుతున్న పోలీసులకు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడే గూస్ బెర్రీ పండ్ల (ఉసిరికాయలను)ను అందించినందుకు అభినందించారు. కీర్తి […]
దిశ, క్రైమ్‌బ్యూరో: కొవిడ్ -19 నివారణకు ముందుండి పోరాడుతున్న సైబరాబాద్ పోలీసులకు ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త, వియ్ హబ్ ఛైర్‌పర్సన్ కీర్తి ప్రియ 3 టన్నుల ఉసిరికాయలను అందజేశారు. మంగళవారం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను ఆమె తమ బృందంతో కలిశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో కరోనా వైరస్ తో పోరాడుతున్న పోలీసులకు వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడే గూస్ బెర్రీ పండ్ల (ఉసిరికాయలను)ను అందించినందుకు అభినందించారు. కీర్తి ప్రియ మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కొవిడ్-19ను అందరికంటే ముందుండి పోరాడడంలో పోలీసుల పాత్ర కీలకం అన్నారు. కార్యక్రమంలో వియ్ హబ్ సీఈవో దీపతిరావు, వైస్ ప్రెసిడెంట్ శకుంతల, అడిషనల్ సీపీ మణిక్రాజ్, అడ్మిన్ అడిషనల్ సీపీ లావణ్య ఎన్జేసీ తదితరులు పాల్గొన్నారు.