ముంబై నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్
దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జిల్లా పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కొంత మంది బతుకుదెరువు కోసం ముంబై నగరానికి వలస వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక..స్వగ్రామానికి వచ్చేందుకు వీలులేక అక్కడే చిక్కుకుపోయారు. వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో నలుగురు వ్యక్తులు సొంతూర్లకు బయలుదేరారు. గురువారం వీరిని హైదరాబాద్‌లో అడ్డుకుని పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి […]
దిశ, నల్లగొండ: యాదాద్రి జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. జిల్లా పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కొంత మంది బతుకుదెరువు కోసం ముంబై నగరానికి వలస వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక..స్వగ్రామానికి వచ్చేందుకు వీలులేక అక్కడే చిక్కుకుపోయారు. వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో నలుగురు వ్యక్తులు సొంతూర్లకు బయలుదేరారు. గురువారం వీరిని హైదరాబాద్‌లో అడ్డుకుని పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలానే మరో నలుగురు వ్యక్తులు జిల్లాకు వచ్చేందుకు పయనమవ్వగా అందులో ఓ వ్యక్తి ఇప్పటికే జనగాం గ్రామానికి చేరుకున్నాడు. మరో ముగ్గురు మాత్రం హైదరాబాద్ నుంచి కాలినడకన వస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు గుడిమల్కాపురం వద్ద అడ్డుకుని బీబీనగర్ ఆస్పత్రికి తరలించారు. నేటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జనగాం, కంకణాలగూడెంలో ఉంటున్న మరో 8మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఆర్డీవో సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యురాలు దీప్తి, ఎంపీపీ ఉమాదేవి, సీఐ శ్రీనివాసులు వారిని గుర్తించి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Tags: corona positive, 3mem, yadadri dist, migrant labourers, mumbai to hyd by walk