అసెంబ్లీలో స్పీకర్‌పైకి చెప్పులు విసిరిన బీజేపీ నేతలు..

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా అసెంబ్లీలో బీజేపీ నేతలు ఆగ్రహంతో స్పీకర్‌పైకి చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. అనంతరం, స్పీకర్‌ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, మైక్రోఫోన్‌లను విసిరారు. అవి స్పీకర్‌ పోడియం దగ్గరలో పడ్డాయి. దీంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. అనంతరం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. బీజేపీ […]

Update: 2021-04-03 21:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా అసెంబ్లీలో బీజేపీ నేతలు ఆగ్రహంతో స్పీకర్‌పైకి చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో చర్చ జరపకుండా ఒడిశా లోకాయుక్త సవరణ బిల్లును సభ ఆమోదించడంపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు.

అనంతరం, స్పీకర్‌ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, మైక్రోఫోన్‌లను విసిరారు. అవి స్పీకర్‌ పోడియం దగ్గరలో పడ్డాయి. దీంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. అనంతరం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. బీజేపీ ఉపనాయకుడు బీసీ సేథీ, పార్టీ విప్‌ మోహన్‌ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్‌ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని, వెంటనే వారు సభలో నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, సభలో తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News