దేశంలో కరోనా ఉగ్రరూపం.. 4 లక్షలకు చేరువగా కొత్త కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,498 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 1,87,62,976కు, మరణాలు 2,08,330కు పెరిగాయి. కొత్త కేసులకు, రికవరీలకు మధ్య సుమారు లక్ష కేసుల అంతరం కొనసాగుతూనే ఉన్నది. కొత్త కేసులు 3.86లక్షలు కాగా, రికవరీలు 2,97,540గా ఉన్నాయి. […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,498 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 1,87,62,976కు, మరణాలు 2,08,330కు పెరిగాయి. కొత్త కేసులకు, రికవరీలకు మధ్య సుమారు లక్ష కేసుల అంతరం కొనసాగుతూనే ఉన్నది. కొత్త కేసులు 3.86లక్షలు కాగా, రికవరీలు 2,97,540గా ఉన్నాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల మరో లక్ష పెరిగాయి. శుక్రవారం ఉదయానికి 31,70,228 కేసులు క్రియాశీలంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.