జంగారెడ్డి గూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిక్కవరం నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్‌ను లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిక్కవరం నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.