కర్ణాటకలో 2.50లక్షల కేసులు

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నమోదైన కేసులతో కలిపి కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 2.50లక్షల మార్క్‌ను దాటేసింది. గురువారం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,385 కరోనా కేసులు తేలాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,975కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,70,381 మంది ఆస్పత్రుల […]

Update: 2020-08-20 11:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నమోదైన కేసులతో కలిపి కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 2.50లక్షల మార్క్‌ను దాటేసింది. గురువారం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,385 కరోనా కేసులు తేలాయి.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,975కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,70,381 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 82,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు అక్కడ కరోనా బారిన పడి 4,429 మంది మరణించారు. ఇదిలాఉండగా, కర్ణాటకలో నమోదైన మొత్తం కేసుల్లో అధికశాతం బెంగళూరు అర్బన్‌ నుంచే నిర్దారణ కావడం ఆందోళన కలిగించే అంశం.

Tags:    

Similar News