28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

దిశ, హైదరాబాద్ : ఈ యాసంగిలో రైతుల నుంచి ఇప్పటి వరకు 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,223 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ.5,223 కోట్లలో ఇప్పటికే రూ. 2,378 కోట్లను వారి ఖాతాల్లో జమ […]

Update: 2020-05-05 09:41 GMT

దిశ, హైదరాబాద్ : ఈ యాసంగిలో రైతుల నుంచి ఇప్పటి వరకు 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ. 5,223 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులకు చెల్లించాల్సిన రూ.5,223 కోట్లలో ఇప్పటికే రూ. 2,378 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా రైతుల నుంచి సేకరించిన 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 26.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లులకు తరలించినట్టు వెల్లడించారు. మంగళవారం (5వ తేదీన) ఒక్కరోజే 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు రూ. 249 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Tags: Civil supply, Chairman Srinivas Reddy, Paddy, Rice mills

Tags:    

Similar News