మహబూబ్ నగర్‌లో 28 కేసులు
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కరోనా వణికిస్తుంది. గత పదిహేను రోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వున్నాయి. తాజాగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మహబూబ్ నగర్‌లో 12 కేసులు రాగా, నారాయణపేట జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 6, నాగర్ కర్నూల్ జిల్లాలో 5కేసులు నమోదయ్యాయి. అధికారుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్‌లో ఐదుగురు వ్యక్తులకు కరోనా నిర్దారణ […]
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కరోనా వణికిస్తుంది. గత పదిహేను రోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వున్నాయి. తాజాగా శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, మహబూబ్ నగర్‌లో 12 కేసులు రాగా, నారాయణపేట జిల్లాలో 5, గద్వాల జిల్లాలో 6, నాగర్ కర్నూల్ జిల్లాలో 5కేసులు నమోదయ్యాయి. అధికారుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్‌లో ఐదుగురు వ్యక్తులకు కరోనా నిర్దారణ అవ్వగా, చివరకు నల్లమలను సైతం కరోనా తాకడం అందోళన కలిగిస్తున్నది. నాగర్ కర్నూల్ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ తేలగా, బిజినపల్లి గ్రామానికి చెందిన మరోక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు జిల్లా వైధ్యాధికారి తెలిపారు. అదే సమయంలో తిమ్మాజీపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, అమ్రాబాద్ మండలం ఈగలపెంట వాసి ఒకరికి, లింగాల మండలం అంబటిపల్లి గ్రామం లోని ఓ మహిళకు, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడించారు. అలాగే గద్వాల పట్టణంలో 4, గట్టు మండలం -1, ఇటిక్యాల మండలం -1, రాజోలి మండలం-2 కేసులు వెలుగుచూశాయి.