సూర్యాపేటలో ఒకేరోజు 26 కొత్త పాజిటివ్ కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకుంది. ఒకే రోజున రాష్ట్రంలో 56కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఒకేసారి 21 కొత్త కేసులు నమోదుకాగా ఇప్పుడు అది మరింత పెరిగింది. జీహెచ్ఎంసీలో సైతం 19 కొత్త కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో రెండు, గద్వాలలో మూడు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 23మంది కరోనా కారణంగా చనిపోయారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరుకుంది. ఒకే రోజున రాష్ట్రంలో 56కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఒకేసారి 21 కొత్త కేసులు నమోదుకాగా ఇప్పుడు అది మరింత పెరిగింది. జీహెచ్ఎంసీలో సైతం 19 కొత్త కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో రెండు, గద్వాలలో మూడు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం మీద 23మంది కరోనా కారణంగా చనిపోయారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కంటైన్‌మెంట్ క్లస్టర్‌లలో పకడ్బందీ చర్యలు కొనసాగుతున్నాయి. అయినా కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సూర్యాపేటలో సైతం గణనీయంగా కొత్తగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఆ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80కు చేరుకుంది. జీహెచ్ఎంసీ తర్వాత అధిక కేసులు నమోదైంది ఈ జిల్లాలోనే. ఇదిలా ఉండగా చికిత్స అనంతరం కోలుకుని ఎనిమిది మంది పేషెంట్లు ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 194కు చేరుకుంది. ఇంకా 711 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆరు రోజుల్లో 278 కొత్త కేసులు
లాక్‌డౌన్ తొలి విడత ముగిసిన మరుసటి రోజు (ఏప్రిల్ 15) నాటికి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 650గా ఉంది. అప్పటికే రాష్ట్రంలో కంటైన్‌మెంట్ క్లస్టర్లు కొనసాగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 21 రాత్రి 9గంటల సమయానికి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 928కి చేరుకుంది. కొత్తగా 278 కేసులు చేరాయి. ఇందులో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా ఆ తర్వాతి స్థానం సూర్యాపేట, గద్వాల జిల్లాల్లోనే ఉన్నాయి. నిజానికి ఏప్రిల్ 7వ తేదీ నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు కొలిక్కి వస్తాయని, కొత్త కేసులు పుట్టే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే నగరంలో లక్షణాలు లేకుండానే పాజిటివ్ కేసులు నమోదువుతూ ఉండడం, వారి ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఎక్కువగా ఉండడంతో వైరస్ వ్యాప్తి వేగమైంది. కంటైన్‌మెంట్ క్లస్టర్ నిర్ణయం తీసుకోవడంతో ఒక మేరకు అదుపులో ఉందని, లేకుంటే ఇంకా భారీ సంఖ్యలో పెరిగి ఉండేవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల చివరికల్లా మొత్తం కాంటాక్టుల వివరాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఇక వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని, కొత్త కేసులు మే మొదటి వారం నుంచి ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: Telangana, Corona, New positive cases, GHMC, Suryapet, Containment Clusters