26 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు ఇచ్చాం

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు 26,64,84,350 వ్యాక్సిన్స్ రాష్ట్రాలు, యూటీలకు పంపిణీ చేసినట్టు కేంద్రం చెప్పింది. వాటిలో 25,12,66,637 కోట్ల వ్యాక్సిన్ డోసులను(వేస్టేజ్‌తో కలిసి) రాష్ట్రాలు, యూటీలు వినియోగించాయని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రాలు, యూటీల దగ్గర 1,53,79,233 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వీటికి తోడు మరో 4,48,760 వ్యాక్సిన్ డోసులు మూడు రోజుల్లో రాష్ట్రాలకు […]

Update: 2021-06-13 06:45 GMT

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు 26,64,84,350 వ్యాక్సిన్స్ రాష్ట్రాలు, యూటీలకు పంపిణీ చేసినట్టు కేంద్రం చెప్పింది. వాటిలో 25,12,66,637 కోట్ల వ్యాక్సిన్ డోసులను(వేస్టేజ్‌తో కలిసి) రాష్ట్రాలు, యూటీలు వినియోగించాయని వెల్లడించింది.

ప్రస్తుతం రాష్ట్రాలు, యూటీల దగ్గర 1,53,79,233 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వీటికి తోడు మరో 4,48,760 వ్యాక్సిన్ డోసులు మూడు రోజుల్లో రాష్ట్రాలకు చేరుకుంటాయని కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News