పేరెంట్స్‌ను కలిపిస్తానని రమ్మన్న FB ఫ్రెండ్.. మహిళపై 25 మంది గ్యాంగ్ రేప్!

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా పరిచయాలు యువతులకు, మహిళలకు హానికరం అని మరోసారి నిరూపితమైంది. ప్రస్తుత సొసైటీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు నేటి తరం మహిళలు. సోషల్ మీడియా విప్లవం వచ్చాక ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కలిసి బాగోగులు అడిగే రోజులు పోయాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారానే యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయితే, యంగ్ జనరేషన్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతుండటంతో […]

Update: 2021-05-15 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా పరిచయాలు యువతులకు, మహిళలకు హానికరం అని మరోసారి నిరూపితమైంది. ప్రస్తుత సొసైటీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు నేటి తరం మహిళలు. సోషల్ మీడియా విప్లవం వచ్చాక ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కలిసి బాగోగులు అడిగే రోజులు పోయాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాద్యమాల ద్వారానే యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయితే, యంగ్ జనరేషన్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతుండటంతో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. అవి కాస్త కొన్ని ఫ్రెండ్ షిప్‌తో ఆగిపోతే మరికొన్ని ప్రేమ పేరుతో హద్దులు దాటుతున్నాయి. కొన్ని పరిచయాలు మహిళలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ మహిళ జీవితాన్ని సర్వనాశనం చేసింది.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను కలిపిస్తానని రమ్మని నయ వంచనకు పాల్పడ్డాడు. అతని మాటలు నమ్మిన ఢిల్లీకి చెందిన మహిళ ఘోరంగా మోసపోయింది. ఇంటికి తీసుకెళ్లే క్రమంలో దారి మార్చి ఆమెను రామ్‌గర్ విలేజ్‌లోని అడవికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో 25 మంది దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని బాధితురాలు ఆరోపించింది. ఘటన మే 3న చోటుచేసుకోగా, సరిగ్గా తొమ్మిది రోజుల అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News