25 మంది వలస కూలీలకు కరోనా

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వలస కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా నమోదైన 14 పాజిటివ్‌లతో కలిపి ఇప్పటి వరకు 25 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకున్నవారిలో కరోనా పాజిటివ్ వస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. కొత్తగా నమోదైన కేసుల్లో యాదాద్రి జిల్లాలో 12 మంది, జగిత్యాలలో ఇద్దరు వలస […]

Update: 2020-05-12 11:22 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వలస కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా నమోదైన 14 పాజిటివ్‌లతో కలిపి ఇప్పటి వరకు 25 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్టు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకున్నవారిలో కరోనా పాజిటివ్ వస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. కొత్తగా నమోదైన కేసుల్లో యాదాద్రి జిల్లాలో 12 మంది, జగిత్యాలలో ఇద్దరు వలస కార్మికులు ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 37 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జీహెచ్ఎంసీ, వలస కార్మికులతో కలిపి కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్సలో ఉన్న 60ఏండ్లు పైబడిన ఇద్దరు వృద్ధులు మంగళవారం మరణించారు. వీరికి హైబీపీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 32కు చేరుకుంది. ఇప్పటి వరకు 1,326 కరోనా కేసులు నమోదవ్వగా.. 472 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం 21 మంది చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. వీరితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 822 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని హెల్త్ బులిటెన్ పేర్కొంటుంది.

Tags:    

Similar News