24 గంటల్లో.. 1,429 కేసులు, 57 మరణాలు
న్యూఢిల్లీ: గడిచిన 24గంటల్లో భారత్‌లో కొత్తగా 1,429 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 57 మరణాలు సంభవించాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 24,506కు చేరగా, ఈ మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 775కు పెరిగిందని తెలిపింది. కరోనా సోకినవారిలో 5,063మంది కోలుకోగా, 18,668మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే, 6817 పాజిటివ్ కేసులు, 301మరణాలతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, తర్వాతి […]
న్యూఢిల్లీ: గడిచిన 24గంటల్లో భారత్‌లో కొత్తగా 1,429 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 57 మరణాలు సంభవించాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 24,506కు చేరగా, ఈ మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 775కు పెరిగిందని తెలిపింది. కరోనా సోకినవారిలో 5,063మంది కోలుకోగా, 18,668మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే, 6817 పాజిటివ్ కేసులు, 301మరణాలతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్ (2815 కేసులు, 127మరణాలు), ఢిల్లీ (2514 కేసులు, 53మరణాలు), రాజస్థాన్ (2034 కేసులు, 27మరణాలు), మధ్యప్రదేశ్ (1852కేసులు, 92మరణాలు) రాష్ట్రాలు ఉన్నాయి.
Tags: coronavirus, India, corona deaths india, union home ministry, covid 19, active cases,