ఢిల్లీ మర్కజ్ మసీదు : 24 మందికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మసీదు కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా మహమ్మారి సోకింది. ఈ మసీదులో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు వ్యక్తులు కరోనాతో ఇప్పటికే మరణించిన విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు తెలంగాణకు చెందిన వారు. కాగా ఒకరు శ్రీనగర్ లో మృతి చెందారు. కరోనా లక్షణాలు కనిపించిన 300 మందికి అధికారులు పరీక్ష నిర్వహించారు కూడా. కాగా, సోమవారం ఉదయం మసీదు మూసేసి.. సుమారు 800 […]

Update: 2020-03-31 00:57 GMT

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మసీదు కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా మహమ్మారి సోకింది. ఈ మసీదులో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు వ్యక్తులు కరోనాతో ఇప్పటికే మరణించిన విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు తెలంగాణకు చెందిన వారు. కాగా ఒకరు శ్రీనగర్ లో మృతి చెందారు. కరోనా లక్షణాలు కనిపించిన 300 మందికి అధికారులు పరీక్ష నిర్వహించారు కూడా. కాగా, సోమవారం ఉదయం మసీదు మూసేసి.. సుమారు 800 మందిని క్వారంటైన్ లోకి పంపించారు. ఇప్పటి వరకు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న 24 మందిలో కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.

Tags: Coronavirus, covid 19, markaz nizamuddin mosque, delhi, 24 positive cases

Tags:    

Similar News