23 శాతం వ్యాక్సిన్ వేస్ట్ చేసిన రాష్ట్రాలు.. జాబితాలో తెలంగాణ

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్ నిల్వలు లేక ప్రజలు టీకాలకోసం కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే పలు రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణి కారణంగా అవి వృథా అవుతున్నాయి. దేశంలో 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని ఆర్టీఐ నివేదికలో తేలింది. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, పంజాబ్, హర్యానా, మణిపూర్, తెలంగాణ ఉండటం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 11 నాటికి […]

Update: 2021-04-20 01:52 GMT

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సిన్ నిల్వలు లేక ప్రజలు టీకాలకోసం కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే పలు రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణి కారణంగా అవి వృథా అవుతున్నాయి. దేశంలో 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని ఆర్టీఐ నివేదికలో తేలింది. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, పంజాబ్, హర్యానా, మణిపూర్, తెలంగాణ ఉండటం గమనార్హం.

సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 11 నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేసిన 10.34 కోట్ల వ్యాక్సిన్లలో 44.78 లక్షల (23 శాతం) టీకాలు వృథా అయ్యాయని వెల్లడైంది. వ్యాక్సిన్ జీరో వేస్టేజీ నమోదైన రాష్ట్రాలలో కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, గోవాలతో పాటు డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.

Tags:    

Similar News