4 రోజుల్లో 23 మంది విమాన ప్రయాణికులకు కరోనా
న్యూఢిల్లీ: దేశీయ విమాన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఫ్లైట్‌లలో ప్రయాణించిన 23 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అన్ని కేసులూ విమానాల్లో ప్రయాణించి గమ్యస్థానంలో దిగిన తర్వాత జరిపిన టెస్టుల్లో బయటపడ్డవే కావడం గమనార్హం. సదరు విమానాలు ల్యాండ్ అయిన నగరాల్లోనే వారందరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆయా విమానాల్లో సేవలందించిన సిబ్బందిని విమానసంస్థలు క్వారంటైన్‌లో ఉంచాయి. కాగా, పాజిటివ్ తేలిన వ్యక్తులతోపాటుగా ప్రయాణించినవారి కోసం అధికారులు వేట ప్రారంభించారు. లాక్‌డౌన్‌కు ముందు నిలిచిపోయిన విమానసేవలను ఈ నెల […]
న్యూఢిల్లీ: దేశీయ విమాన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఫ్లైట్‌లలో ప్రయాణించిన 23 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అన్ని కేసులూ విమానాల్లో ప్రయాణించి గమ్యస్థానంలో దిగిన తర్వాత జరిపిన టెస్టుల్లో బయటపడ్డవే కావడం గమనార్హం. సదరు విమానాలు ల్యాండ్ అయిన నగరాల్లోనే వారందరిని క్వారంటైన్‌లో ఉంచారు. ఆయా విమానాల్లో సేవలందించిన సిబ్బందిని విమానసంస్థలు క్వారంటైన్‌లో ఉంచాయి. కాగా, పాజిటివ్ తేలిన వ్యక్తులతోపాటుగా ప్రయాణించినవారి కోసం అధికారులు వేట ప్రారంభించారు. లాక్‌డౌన్‌కు ముందు నిలిచిపోయిన విమానసేవలను ఈ నెల 25న అదీ దేశీయ విమాన సేవలనే కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.