21, 260 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ
దిశ, రంగారెడ్డి: పేదలకు, వలస కార్మికులందరికీ ఉచితంగా బియ్యం, నగదు పంపిణీని పకడ్బంధీగా చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలు, పేదలు, వలస కార్మికులకు బియ్యం పంపిణీ తదితర అంశాలపై.. అడిషనల్ కలెక్టర్ హరీష్, జిల్లా సప్లై అధికారి రాథోడ్ తదితరులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు పంపిణీ […]
దిశ, రంగారెడ్డి: పేదలకు, వలస కార్మికులందరికీ ఉచితంగా బియ్యం, నగదు పంపిణీని పకడ్బంధీగా చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలు, పేదలు, వలస కార్మికులకు బియ్యం పంపిణీ తదితర అంశాలపై.. అడిషనల్ కలెక్టర్ హరీష్, జిల్లా సప్లై అధికారి రాథోడ్ తదితరులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 5,24,887 కార్డులు ఉండగా.. 17,48,545 మంది లబ్దిదారులకు 21 వేల 260 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని సబితా ఇంద్రారెడ్డి తెలియచేశారు.
Tags: Minister Sabitha Indra Reddy, review, rice distribution, rangareddy