రూల్స్ బ్రేక్.. దుకాణదారుడికి రూ. 20 వేల ఫైన్
దిశ, వరంగల్: లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారుడికి వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రూ. 20 వేల జరిమానా విధించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన సమయంలో నిత్యావసర వస్తువులను అధిక రేట్లకు అమ్మకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ హెచ్చరించారు కూడా. ఈ క్రమంలోనే శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్‌కు హన్మకొండ […]
దిశ, వరంగల్: లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారుడికి వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రూ. 20 వేల జరిమానా విధించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన సమయంలో నిత్యావసర వస్తువులను అధిక రేట్లకు అమ్మకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ హెచ్చరించారు కూడా. ఈ క్రమంలోనే శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్‌కు హన్మకొండ గోపాలపురానికి చెందిన శ్రీనివాస్ కాల్ చేశాడు. స్థానిక రాజేశ్వరి కిరాణా షాపులో పసుపు ధర కిలో రూ.200కు అమ్ముతున్నట్టు చెప్పాడు. ఈ మేరకు స్పందించిన జిల్లా పౌర సరఫరాల అధికారి షాపు యజమానికి రూ.20 వేల జరిమానా విధించారు.
Tags : kirana shop, 2o000 fine, corona, lockdown, warangal