ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌కు అంపైర్‌లు వీరే.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

వన్డే ప్రపంచకప్‌-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-08 09:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఆక్టోబర్‌ 5న చెన్నై వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ కోసం 16 మందితో కూడిన అంపైర్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యత్వం పొందిన అంపైర్‌లు 12 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్‌లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్‌ నుంచి నితిన్‌ మీనన్‌కు ఒక్కడికే చోటు దక్కింది.

అదే విధంగా 2019 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అంపైర్‌లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, రాడ్ టక్కర్‌ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అదే విధంగా ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్‌ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. జెఫ్ క్రోవ్, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్‌ రిఫరీలగా ఐసీసీ నియమించింది.

వరల్డ్‌ కప్‌కు అంపైర్‌లు వీరే..

క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షైద్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్‌ విల్సన్‌, పాల్‌ విల్సన్‌


Similar News