ICC World Cup 2023: డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర సెంచరీ..

Update: 2023-10-10 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మలాన్‌ 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ తర్వాత గేర్‌ మార్చిన మలాన్‌.. మెహిది హసన్‌ మీరజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 33వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4 పరుగులు సాధించాడు. ఈ సెంచరీతో మలాన్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మలాన్‌ వన్డేల్లో వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 6 సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మలాన్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే 6 సెంచరీలు చేయగా.. పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 27 ఇన్నింగ్స్‌ల్లో 6 శతకాలు బాది మలాన్‌ వెనుక ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు మలాన్‌ మరో ఘనత సాధించాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు (4) చేసిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా డేవిడ్‌ గోవర్‌ (1983), జానీ బెయిర్‌స్టో (2018)ల సరసన నిలిచాడు.

Tags:    

Similar News