వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఇద్దరు అరెస్ట్
క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్అధికారులు ఐఎస్ సదన్పోలీసులతో కలిసి అరెస్టు చేశారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్న ఇద్దరిని దక్షిణ మండలం టాస్క్ఫోర్స్అధికారులు ఐఎస్ సదన్పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.79 వేల నగదుతోపాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్అదనపు డీసీపీ ఏ.వీ.ఆర్.నరసింహారావు వివరాల ప్రకారం.. చంపాపేట్ వాస్తవ్యులైన యశ్వంత్(34) ప్రైవేట్ఉద్యోగి. అదే ప్రాంతంలో ఉంటున్న ప్రవీణ్‌కుమార్(38) వ్యాపారి.
ఇటీవల జరిగిన క్రికెట్ వరల్డ్ కప్సమయంలో తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ఈ ఇద్దరు జోరుగా క్రికెట్బెట్టింగులు నిర్వహించారు. దీంట్లో కింగ్పిన్అయిన మియాపూర్నివాసి ప్రసాద్ఈ ఇద్దరికి ఎంపీ కింగ్, గో ఎక్స్ఛేంజ్తదితర యాప్‌లకు సంబంధించిన లాగిన్ఐడీలు, పాస్‌వర్డులు అంద చేసి బెట్టింగ్దందా జరిపించాడు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందటంతో టాస్క్ఫోర్స్సీఐ మధుసూదన్, ఎస్సైలు నర్సింలు, ఆంజనేయులు, నవీన్‌తో పాటు ఐఎస్సదన్పోలీసులతో కలిసి యశ్వంత్, ప్రవీణ్‌కుమార్‌లను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రసాద్కోసం గాలిస్తున్నారు.