ICC World Cup 2023: 'ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువ'

వన్డే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు.

Update: 2023-09-14 13:54 GMT

న్యూఢిల్లీ : వన్డే ప్రపంచకప్ గెలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తెలిపాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన.. తన వరల్డ్ కప్ ఫేవరెట్స్ టీమ్‌ను రివీల్ చేశాడు. ఆ జాబితాలో టీమ్ ఇండియానే బిగ్గెస్ట్ ఫేవరెట్ అని చెప్పాడు. ‘భారత్‌కే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు బలంగా ఉండటమే అందుకు కారణం. అలాగే, స్వదేశంలో జరగడం భారత్‌కు అడ్వాంటేజ్. భారత్ మ్యాచ్‌ ఎక్కడ జరిగినా అభిమానులు వేల సంఖ్యలో వస్తారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతారు. అందుకే, ఈ సారి టీమ్ ఇండియానే బిగ్గెస్ట్ ఫేవరెట్.’ అని తెలిపాడు.

అలాగే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లను కూడా తన ఫేవరెట్స్ లిస్ట్‌లో చేర్చాడు. అదృష్టం కూడా కలిసి రావడం ముఖ్యమని చెప్పాడు. ‘గత ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ అదృష్టవశాత్తూ గెలుచుకుంది. లేదంటే న్యూజిలాండ్ కచ్చితంగా విజేతగా నిలిచేది.’ అని తెలిపాడు. అలాగే, ఐపీఎల్ గురించి మాట్లాడుతూ..‘ఐపీఎల్ చాలా మంది టాలెంట్ క్రికెటర్లను ఇండియాకు అందించింది. భారత క్రికెట్ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉండటానికి ఐపీఎలే కారణం.’ అని చెప్పుకొచ్చాడు.


Similar News