WorldCupFinal: అహ్మదాబాద్‌కు వచ్చేసిన సారా.. ఇక గిల్‌ను ఆపడం కష్టమేనా?
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి. క్రికెట్ ప్రపంచం టైటిల్ హాట్ ఫేవరైట్‌గా ఇండియాను పరిగణిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచకప్ 2023 టీమ్ ఇండియా కచ్చితంగా సాధిస్తుందని చాలామంది విశ్లేషించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌ను మైదానంలో వీక్షించేందుకు తాజా, మాజీ క్రికెటర్లే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఊవ్విళ్లూరుతున్నారు.
ఇప్పటికే కొందరు గుజరాత్‌కు చేరుకోగా.. మరి కొందరు చేరుకోనున్నారు. తాజాగా.. ఇవాళ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండుల్కర్ గుజరాత్‌కు చేరుకున్నారు. దాదాపు అన్ని మ్యాచులను మైదానాల్లోనే వీక్షించిన సారా.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఒకరోజు ముందే అహ్మదాబాద్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. సారా మైదానంలో ఉంటే.. గిల్‌ను ఆపడం ఆస్ట్రేలియా బౌలర్ల వల్ల కాదేమో అని పోస్టులు పెడుతున్నారు. కాగా, తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఈ ఫైనల్ మ్యాచ్‌కు రామ్ చరణ్, వెంకటేశ్, నాగార్జునతో పాటు తమిళ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌లు, ఇక బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్ హాజరుకానున్నారు.