గుండెలకు హత్తుకొని షమీని ఓదార్చిన ప్రధాని మోడీ
ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ సాధించాలని కోరుకున్న కోట్లాదిమంది భారతీయుల ఆశలు అడియాశలు అయ్యాయి. వరుసగా పది మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా కీలక ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ సాధించాలని కోరుకున్న కోట్లాదిమంది భారతీయుల ఆశలు అడియాశలు అయ్యాయి. వరుసగా పది మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా కీలక ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దీంతో సొంత గడ్డపై ప్రపంచ కప్ కోల్పోవాల్సి వచ్చింది. దీనిని కోట్లాదిమంది భారత క్రికెట్ ఫ్యాన్సే కాకుండా స్వయంగా క్రీడాకారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, సిరాజ్‌లు భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టారు.
దీంతో మ్యాచ్ అనంతరం స్వయంగా ప్రధాని మోడీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి జట్టును ఓదార్చారు. కన్నీరుతో ఉన్న షమీని హత్తుకొని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను షమీ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ‘దురదృష్ణవశాత్తు నిన్న మన రోజు కాదు. టోర్నీ మొత్తం మా జట్టుకు, నాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ ధన్యవాదాలు. ప్రత్రేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి తమలో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోడీకి థాంక్స్. మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాం’ అని ట్విట్టర్‌లో షమీ పేర్కొన్నారు.