ICC World cup 2023: వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన పాక్.. స్టార్ పేసర్ ఔట్

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది.

Update: 2023-09-22 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్.. వరల్డ్ కప్ ఆడే జట్లను ప్రకటించాయి. చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం వెల్లడించింది. పాకిస్తాన్ జట్టుకు బాబర్‌ ఆజమ్ సారథ్యం వహించనున్నాడు. పాకిస్తాన్‌ జట్టులో ఇద్దరు ఊహించని ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఆసియా కప్‌ 2023లో గాయపడిన స్టార్‌ పేసర్‌ నసీం షా ప్రపంచకప్‌ 2023కి దూరమయ్యాడు. ఆసియా కప్‌ మధ్యలో వైదొలిగిన మరో స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ మాత్రం చోటు దక్కించుకున్నాడు. రవూఫ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు పీసీబీ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే ఎవరూ ఊహించిన విధంగా పేసర్ హసన్‌ అలీ, స్పిన్నర్‌ ఉస్మా మీర్‌లకు పాక్ జట్టులో చోటు దక్కింది. నసీం షా స్ధానంలో అలీ ఎంపిక అయ్యాడు. రిజర్వ్‌ జాబితాలో మహ్మద్‌ హ్యారిస్‌, జమాన్‌ ఖాన్‌, అర్బర్‌ అహ్మద్‌లకు చోటు దక్కింది. ఆక్టోబర్‌ 6న హైదరాబాద్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

పాకిస్తాన్ జట్టు:

ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ ఆలీ అఘా, షాదబ్ ఖాన్, ఉసమా మిర్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ ఆలీ

ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: అబ్రర్ అహ్మద్, జమాన్ ఖాన్, మహ్మద్ హారీస్


Similar News