ICC World Cup 2023: 'వరల్డ్‌కప్‌లో దుమ్ములేపేది అతడే'.. పాక్ క్రికెటర్‌పై గంభీర్ ప్రశంసలు

మరో రెండు వారాల్లో భారత్ వేదికగా ICC World Cup 2023 మెగా సమరానికి తెర లేవనుంది.

Update: 2023-09-23 12:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు వారాల్లో భారత్ వేదికగా ICC World Cup 2023 మెగా సమరానికి తెర లేవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 5న ఐసీసీ ఈవెంట్‌ షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో అక్టోబరు 14న దాయాదుల వార్ భారత్‌-పాకిస్తాన్‌ జరగబోతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరుపై ఇరు దేశాల మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్‌-2023లో తాను బాబర్‌ ఆజం ఆట కోసమే ఎదురుచూస్తున్నానని.. వరల్డ్‌కప్‌లో ఫైర్‌ సెట్‌ చేసేది అతడే అని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా గానీ.. బాబర్‌ వేరే లెవల్‌ అంటూ ఆకాశానికెత్తాడు. బాబర్‌ ఆజంలోని ప్రత్యేక స్కిల్‌సెట్‌ అతడిని ఈ స్థాయిలో నిలిపిందని అతడిపై గౌతం గంభీర్‌ ప్రశంసలు కురిపించాడు.


Similar News