ICC World Cup 2023: ప్రపంచకప్‌ ముందు న్యూజిలాండ్‌‌కు బిగ్ షాక్.. స్టార్‌ పేసర్‌కు సర్జరీ!

Update: 2023-09-20 16:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌కు గాయమైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో క్యాచ్‌ పట్టే క్రమంలో న్యూజిలాండ్ సీనియర్‌ పేసర్‌ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. దీంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. సర్జరీ అనంతరం వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడు వన్డే ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్‌ 5న ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది.


Similar News