ICC World Cup Anthem 2023: వరల్డ్​కప్​ యాంథమ్ ​వచ్చేసిందోచ్..

రానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ తాజాగా వరల్డ్​కప్ అధికారిక థీమ్‌ సాంగ్‌ను లాంఛ్​ చేసింది.

Update: 2023-09-20 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: రానున్న ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ తాజాగా వరల్డ్​కప్ అధికారిక థీమ్‌ సాంగ్‌ను లాంఛ్​ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తమ అఫీషియల్ సోషల్ మీడియా వెబ్​సైట్స్‌లో ఐసీసీ అప్​లోడ్​ చేసింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్‌తో పాటు మ్యూజిక్​ డైరెక్టర్​ ప్రీతమ్ కనిపించి ప్రేక్షకులను అలరించారు. 3 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి ఉన్న ఈ సాంగ్​ ఇప్పుడు క్రికెట్​ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 'దిల్ జష్న్ బోలే' అంటూ సాగే పాట​ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక రణ్‌వీర్‌ సింగ్‌, ప్రీతమ్‌తో పాటు క్రికెటర్​ యజువేంద్ర చాహల్‌ సతీమణి ధన శ్రీ వర్మ కూడా ఈ వీడియో సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. శ్లోక్ లాల్, సావేరి వర్మ సాహిత్యం అందించగా.. ప్రీతమ్ సంగీతం అందించారు.


Similar News