ICC World cup 2023: రాణించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. నెదర్లాండ్స్ టార్గెట్ ఇదే

Update: 2023-10-06 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్స్‌లో.. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ కలిసి నాలుగో వికెట్‌కి 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 52 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసిన సౌద్ కీల్, ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 75 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని బస్ దే లీడే పెవిలియన్ చేర్చాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో.. బస్ దే లీడేకి 4 వికెట్లు తీయగా.. కోలిన్ అకెర్మాన్ 2 వికెట్లు తీశాడు.


Similar News