ICC World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌

Update: 2023-10-06 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్తాన్‌ తమ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని బాబర్‌ ఆజం బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 28.1 ఓవర్ వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్. ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో సౌద్‌ షకీల్‌ అవుటయ్యాడు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాకిబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రిజ్వాన్‌ 53 పరుగులతో, ఇఫ్తికర్‌ అహ్మద్‌ క్రీజులో ఉన్నారు.


Similar News