ICC World Cup 2023: ప్రపంచాన్ని చుట్టేసి హైదరాబాద్‌కు.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరల్డ్ కప్ ట్రోఫీ..

Update: 2023-09-20 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శించారు. గత కొన్నిరోజులుగా ప్రపంచంలోని వివిధ ప్రముఖ ప్రదేశాలలో ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతున్న ఐసీసీ.. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చింది. రామోజీ గ్రూపు ఉద్యోగుల సందర్శనార్థం దీన్ని ప్రదర్శించింది. ఫిల్మ్ సిటీలోని అబ్బురపరిచే క్యారమ్ గార్డెన్‌లో దీన్ని ప్రదర్శించారు. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ ట్రోఫీని లండన్‌లోని గారార్డ్ అనే లగ్జరీ జ్యుయలరీ తయారీ సంస్థ రూపొందించింది. వెండితో తయారైన ఈ ట్రోఫీకి పైనుంచి బంగారు పూత పూశారు. 60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ట్రోఫీ పైన బంగారు వర్ణంలో గ్లోబు ఉంటుంది. మూడు సిల్వర్ కాలమ్‌లు ఉంటాయి.


Similar News