ICC World Cup 2023: 'వారిని టీమిండియా జట్టుతో ఉండేలా చూసేవాణ్ని'

స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి.

Update: 2023-09-20 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓ సలహా ఇచ్చాడు. మొదటిసారి ప్రపంచకప్ ఆడుతున్న భారత యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్‌లకు మీరిచ్చే సలహా ఏంటని ప్రశ్నించగా.. ‘‘నేను బీసీసీఐ అధికార వర్గాల్లో ఉంటే సచిన్, ఎంఎస్ ధోనీ, యువరాజ్‌ సింగ్ అందుబాటులో ఉంటే యువ ఆటగాళ్లకు తమ అనుభవాలను వివరించడానికి వారు ప్రపంచకప్‌ జట్టుతో సమయం గడిపేలా చూసేవాడిని’’ అని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన కొన్ని టోర్నీల్లో సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌కు చేరుకున్న భారత జట్టు కీలక సమయాల్లో తడబడింది.


Similar News