'మన్‌స్టర్' వేరియంట్ బైకులను తీసుకొచ్చిన డుకాటీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ దేశీయ మార్కెట్లో తన కొత్త మన్‌స్టర్ బైక్ మోడళ్లను తీసుకొచ్చింది. డుకాటీ మన్‌స్టర్, మన్‌స్టర్ ప్లస్ వేరియంట్లలో ఈ బైకును తీసుకొచ్చామని, స్పోర్ట్‌లుక్‌తో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా దీని తయారీని చేపట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో డుకాటీ మన్‌స్టర్ వేరియంట్ రూ. 10.99 లక్షలు, మన్‌స్టర్ ప్లస్ ధర రూ. 11.24 లక్ష(ఎక్స్‌షోరూమ్)లతో లభిస్తుందని, ఈ బైకులు రెడ్,డార్క్ స్టెల్త్, ఏవియేటర్ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటీ దేశీయ మార్కెట్లో తన కొత్త మన్‌స్టర్ బైక్ మోడళ్లను తీసుకొచ్చింది. డుకాటీ మన్‌స్టర్, మన్‌స్టర్ ప్లస్ వేరియంట్లలో ఈ బైకును తీసుకొచ్చామని, స్పోర్ట్‌లుక్‌తో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా దీని తయారీని చేపట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో డుకాటీ మన్‌స్టర్ వేరియంట్ రూ. 10.99 లక్షలు, మన్‌స్టర్ ప్లస్ ధర రూ. 11.24 లక్ష(ఎక్స్‌షోరూమ్)లతో లభిస్తుందని, ఈ బైకులు రెడ్,డార్క్ స్టెల్త్, ఏవియేటర్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.
మన్‌స్టర్ వేరియంట్ తక్కువ బరువుతో 166 కేజీలను కలిగి ఉంటుందని, ఇది అంతకుముందు మార్కెట్లో ఉన్న బైక్ కంటే 60 శాతం తక్కువ బరువుతో లభిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ బైకులు 937 సీసీ ఇంజిన్‌తో వస్తుందని, 4.3 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ సహా ఇంకా అనేక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కాగా, ప్రస్తుతం మార్కెట్లో ట్రయంఫ్ బైకు ధర కంటే రూ. 50 వేలు తక్కువతో డుకాటీ బైక్ పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.