మోస్ట్ ట్వీటెడ్ టీవీ షోస్! టాప్‌లో స్వ్కిడ్ గేమ్!
దిశ, ఫీచర్స్ : కరోనా గుప్పిట్లోనే.. భయంభయంగా 2020 గడిచిపోగా.. 2021 కూడా ఆ ఆందోళనకు కొనసాగింపుగానే వచ్చింది. అయితే వ్యాక్సిన్ రావడం, కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జనాలు సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత మళ్లీ గజిబిజీ జీవితాల్లోకి అడుగుపెట్టారు. కానీ అప్పటికీ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ అంటూ మరోసారి మహమ్మారి భయపెట్టడంతో మాస్క్‌లు ధరించి, శానిటైజర్స్ క్యారీ చేస్తూ 2021ని కూడా గడిపేశాం. అయితే ఈ కాలచక్రంలో మన బోర్‌డమ్‌ను తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్ […]
దిశ, ఫీచర్స్ : కరోనా గుప్పిట్లోనే.. భయంభయంగా 2020 గడిచిపోగా.. 2021 కూడా ఆ ఆందోళనకు కొనసాగింపుగానే వచ్చింది. అయితే వ్యాక్సిన్ రావడం, కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో జనాలు సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత మళ్లీ గజిబిజీ జీవితాల్లోకి అడుగుపెట్టారు. కానీ అప్పటికీ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ అంటూ మరోసారి మహమ్మారి భయపెట్టడంతో మాస్క్‌లు ధరించి, శానిటైజర్స్ క్యారీ చేస్తూ 2021ని కూడా గడిపేశాం. అయితే ఈ కాలచక్రంలో మన బోర్‌డమ్‌ను తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్ అందించినవి మాత్రం సినిమాలు, టీవీ సిరీస్‌లే. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఏ సిరీస్‌ల గురించి ఎక్కువగా ట్వీట్ చేశారో తెలుసుకుందాం.
అందరూ ఊహించినట్లుగానే 2021లో అత్యధికంగా ట్వీట్ చేసిన టీవీ షోల జాబితాలో కొన్ని అతిపెద్ద సిరీస్‌లు ఉన్నాయి. కానీ షో ముగిసి రెండున్నర సంవత్సరాల గడుస్తున్నా.. ఇప్పటికీ కూడా ప్రజలు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’(GOT) గురించి ట్వీట్ చేస్తుండటం విశేషం. బహుషా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన అమెరికన్ ఎపిక్ ఫాంటసీ టెలివిజన్ సిరీస్ ‘ది వీల్ ఆఫ్ టైమ్’ ఇందుకు కారణంగా భావించొచ్చు. రాబర్ట్ జోర్డాన్ నవల సిరీస్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌కు ‘GOT’తో పోలికలు ఉండటంతో ట్విట్టరర్స్ మరోసారి ఆ సిరీస్‌ను గుర్తుచేసుకోవడంతో టాప్ టెన్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది.
టాప్ ట్వీటెడ్ సిరీసెస్ :
1. స్వ్కిడ్ గేమ్
2. వాండా విజన్
3. సీసామే స్ట్రీట్
4. శాటర్‌డే నైట్ లైవ్
5. గేమ్ ఆఫ్ థ్రోన్స్
6. జియోపార్డీ
7. గ్రే ఆఫ్ అనాటమీ
8. ద సింప్సన్స్
9. లోకి
10. ద వాకింగ్ డెడ్