యాసిడ్ అటాక్ బాధితుల సాయం మరిచిపోలేను : హీరోయిన్
దిశ, సినిమా : టాలెంటెడ్ పార్వతి తిరువొతు నటించిన ‘ఉయరే’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకుంది. అసిఫ్ అలీ, టొవినో థామస్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పార్వతి యాసిడ్ బాధితురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరెంతో మంది యాసిడ్ బాధితులకు స్ఫూర్తినిచ్చేలా తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. కాగా సినిమా విడుదలై రెండేళ్లు అయినా.. ఇందతా నిన్ననే జరిగినట్లు ఉందని తెలిపింది పార్వతి. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఇంతలా ఆదరిస్తారని, ప్రేక్షకులు తనను […]
దిశ, సినిమా : టాలెంటెడ్ పార్వతి తిరువొతు నటించిన ‘ఉయరే’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకుంది. అసిఫ్ అలీ, టొవినో థామస్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పార్వతి యాసిడ్ బాధితురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరెంతో మంది యాసిడ్ బాధితులకు స్ఫూర్తినిచ్చేలా తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. కాగా సినిమా విడుదలై రెండేళ్లు అయినా.. ఇందతా నిన్ననే జరిగినట్లు ఉందని తెలిపింది పార్వతి. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఇంతలా ఆదరిస్తారని, ప్రేక్షకులు తనను ఇంత గొప్పగా ప్రేమిస్తారని అనుకోలేదని చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతీ రివ్యూ గురించి యాసిడ్ అటాక్ బాధితులు తనతో పంచుకున్న అనుభవాల పట్ల గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. యాసిడ్ అటాక్‌లో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు తనతో వారి కథలను పంచుకోవడం వల్లే ఈ మూవీలోని పల్లవి పాత్రకు న్యాయం చేయగలిగానని చెప్పింది.
పైలట్ కావాలని కలలు కనే పల్లవిపై ప్రేమించినవాడే ఎందుకు యాసిడ్ అటాక్ చేశాడు? ఆ తర్వాత పైలట్ ట్రైనింగ్ నుంచి తప్పుకున్న పల్లవి.. ఎవరి సాయంతో ఎయిర్‌హోస్టెస్‌గా కెరియర్ ప్రారంభించింది? పల్లవి ఎయిర్‌హోస్టెస్‌గా వర్క్ చేస్తున్న ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, కోపైలట్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండగా.. తను చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్‌లో ఉన్నవారి ప్రాణాలు ఎలా కాపాడింది? అనేది కథ.