మరో 2 కరోనా పాజిటివ్ కేసులు
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మరో 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ సేకరించి తదుపరి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. గతంలో కొన్ని ల్యాబ్‌కు పంపగా, శనివారం మరో 103మంది శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించామన్నారు. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ రాగా, మరికొన్ని రావాల్సి ఉందన్నారు. జిల్లా […]
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మరో 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ సేకరించి తదుపరి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. గతంలో కొన్ని ల్యాబ్‌కు పంపగా, శనివారం మరో 103మంది శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించామన్నారు. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ రాగా, మరికొన్ని రావాల్సి ఉందన్నారు. జిల్లా ప్రజలందరూ 100శాతం లాక్‌డౌన్ పాటిస్తూ ఇండ్లకే పరిమితం కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని కోరారు. వచ్చే వారం రోజులు మనమంతా పకడ్బందీగా లాక్ డౌన్ పాటించాలని, అప్పుడే వైరస్ వ్యాప్తి తగ్గుతుందన్నారు.
Tags: carona, lockdown, 2 positve cases, collecter narayana reddy, total 49 cases