ఏపీలో తెలంగాణ మద్యం పట్టివేత
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేస్తూ, ధరలను భారీ ఎత్తున పెంచి విక్రయాలకు అనుమతిచ్చింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు అక్రమార్కులు గ్రామాల్లో నాటుసారా తయారీ ఆరంభించగా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దానిని ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బరితెగించిన కొందరు తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేసి ఏపీకి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ఉదయం కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద టాస్క్ […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేస్తూ, ధరలను భారీ ఎత్తున పెంచి విక్రయాలకు అనుమతిచ్చింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు అక్రమార్కులు గ్రామాల్లో నాటుసారా తయారీ ఆరంభించగా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దానిని ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బరితెగించిన కొందరు తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేసి ఏపీకి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ఉదయం కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు మూడు బైకులపై 2 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు.